బీఆర్ఎస్‌లో చేరిన నాయకులకు ఘన సన్మానం
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులను మంగళవారం ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వడ్ల బసవరాజు, కుర్రి కృష్ణ, చామకూర రాజును మండల బీఆర్ఎస్ నాయకులు, గ్రామ సర్పంచ్ ఆరిగే ధర్మతేజ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ బీర్కూర్ మండలంలో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం...