బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులను మంగళవారం ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వడ్ల బసవరాజు, కుర్రి కృష్ణ, చామకూర రాజును మండల బీఆర్ఎస్ నాయకులు, గ్రామ సర్పంచ్ ఆరిగే ధర్మతేజ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ బీర్కూర్ మండలంలో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరిగే ధర్మతేజ, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు బాలకృష్ణ, దొంతురం విట్టల్, వార్డ్ సభ్యుడు ఖాజా, మేకల రాములు, కుర్రి కృష్ణ, వడ్ల బసవరాజు, చామకూర రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.