బదిలీపై వెళ్లున్న ఉద్యోగిని లలితకు ఘన సన్మానం

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో గత 14 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట ఆరోగ్య సేవలు అందించిన హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగిని లలిత బదిలీపై మరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గైని శ్రీనివాస్ మాట్లాడుతూ, లలిత గ్రామ ప్రజలకు అంకితభావంతో సేవలు అందిస్తూ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గ్రామంలో చిన్నా పెద్దా తేడా...