చందూర్, బతుకమ్మ :
చందూర్ మండలం కారేగాం తండా సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్‌సింగ్ పి.హెచ్.డి డాక్టరేట్ పొందడంతో మండల కేంద్రంలో మాజీ డిసిసిబి అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి లాల్‌సింగ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డా.కడాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి, మాజీ సర్పంచ్ సాయి రెడ్డి, చందూర్ సొసైటీ చైర్మన్ అశోక్, సర్పంచులు రవి, ఉమారాణి, సంజీవ్, కృష్ణ, రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ లు డాక్టర్ రామావత్ లాల్‌సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.