Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 4:46 pm Posted by : ramakrishna

డాక్టర్ రామావత్ లాల్‌సింగ్‌కు ఘన సన్మానం

 

. . . చందూర్ మండల పరిషత్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం

 

చందూర్, బతుకమ్మ : 

 

చందూర్ మండలంలో మండల అభివృద్ధి అధికారి నీలావతి, మండల ప్రత్యేక అధికారి రజిత ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన కారేగాం తాండా సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్‌సింగ్‌ను మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ పొందడం అభినందనీయమని తెలిపారు. డాక్టరేట్ సాధించిన డాక్టర్ రామావత్ లాల్‌సింగ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ఏ.ఈ. గోపి, కైఫ్, కేదేశ్వరి, ఎం.పి.ఓ. శ్రీనివాస్, సర్పంచులు మాధవి రెడ్డి, రవి సంజీవ్ తదితరులు పాల్గొని డాక్టర్ రామావత్ లాల్‌సింగ్‌ను అభినందించారు.