Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 7:00 pm Posted by : ramakrishna

అట్టహాసంగా రైతు ఆశీర్వాద సభ

 

. . . హర్షం వెలిబుచ్చిన అన్నదాతలు

 

. . . కంజర్ రైతు వేదిక నుండి రైతులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

 

మోపాల్, బతుకమ్మ :

 

అన్నదాతకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ప్రస్తుత ఖరీఫ్ సీజన్ – 2026 కు సంబంధించి నిధులను అందించిన నేపథ్యంలో శుక్రవారం అట్టహాసంగా రైతు ఆశీర్వాద సభ నిర్వహించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనగా, ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వర్చువల్ విధానం ద్వారా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల నుండి రైతులు ఎంతో ఆసక్తితో వీక్షించారు. ఇందులో భాగంగానే మోపాల్ మండలం కంజర్ రైతు వేదిక నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కల్లు గీతా కార్మిక సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ఆత్మ పీ.డీ తిరుమల ప్రసాద్ తదితరులు స్థానిక రైతులతో కలిసి పాల్గొన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల వ్యవధిలోనే రూ. 9 వేల కోట్లు రైతు భరోసా నిధులు జమ చేయడం పట్ల రైతులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. రైతు భరోసా నిధులను వినియోగిస్తూ ఖరీఫ్ పంటల సాగుకు శ్రీకారం చుట్టామని రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

 

Grand Farmers' Blessing Meeting

 

ఎన్యూమరేషన్ ఫారం అందించకపోతే ఓటరు జాబితాలో పేరు గల్లంతు : కలెక్టర్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను అనుసరిస్తూ ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంను నింపి బూత్ లెవెల్ అధికారికి అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కంజర్ రైతు వేదికలో కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతి ఓటరు ప్రాధాన్యత ఇస్తూ తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంలు బీఎల్ఓ లకు సమర్పించాలని అన్నారు. లేని పక్షంలో ముసాయిదా ఓటరు జాబితాలో పేరు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు అందరూ ఎన్యూమరేషన్ ఫారంలు అందించాలని, ఈ మేరకు ప్రజాప్రతినిధులు కూడా తమవంతు బాధ్యతగా చొరవ చూపాలని అన్నారు.

 

Grand Farmers' Blessing Meeting