Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2024, 5:08 pm Posted by : ramakrishna

శ్రీ భాషిత పాఠశాలలో  వైభవంగా దీపావళి వేడుకలు

బతుకమ్మ, ఆర్మూర్: ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలలో బుధవారం రోజు దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ పాఠశాల సిబ్బంది అయినా (ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్) సన్మానించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఈరోజు మా పాఠశాలలో పనిచేస్తున్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ ని సన్మానించడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. వీళ్ళు కూడా పాఠశాలలో ఒక భాగం అని, కొనియాడారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల కరస్పాండెంట్ పోల పల్లి సుందర్ విద్యార్థులకు దీపావళి పండుగ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగింది. విద్యార్థులు కూడా వారిలో ఉన్న సృజనాత్మకత మెలకువలతో వివిధ రకాల దీపాలను తయారు చేసుకొని వచ్చారు. ఇటువంటి హిందూ సాంప్రదాయకరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులలో ఉన్న మెలకువలను బయటకు తీసి వారికి హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే విధానము, భారతదేశ భక్తి పెంపొంచే విధానాన్ని మా వంతు ప్రయత్నం గా చేస్తూనే ఉన్నాము అని చెప్పారు. అనంతరం విద్యార్థులు టపాకాయలు కాల్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.