. . . ఉత్సవ కార్యక్రమానికి హాజరైన నాలుగు తరాల కుటుంబ సభ్యులు
బాన్సువాడ, బతుకమ్మ :
బీర్కూర్ గ్రామంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో ఎన్నువార్ సాయమ్మ భర్త కీ.శే గంగారం వారి శతవసంతోత్సవ వేడుకలను నాలుగు తరాల కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి మంగళ వాయిద్యాల మధ్య స్వాగతం పలికి ఆయురారోగ్యాల కోసం గణపతి పూజ, లలిత సహస్రనామం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లలు, మనవళ్లు కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. శాలువా పూలదండ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. పాత ఫోటోలు వీడియోలతో స్వాతంత్రం నుండి స్మార్టోన్ వరకు వారు చూసిన అన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం కేక్ కటింగ్ చేసి కుటుంబ సభ్యులు ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్ను వార్ సాయమ్మ పేరు మీద అన్నదానం, వృద్ధాశ్రమానికి విరాళం మొక్కలు నాటడం ఇలాంటి కార్యక్రమాలు చేశామని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నువార్ కుటుంబానికి చెందిన నాలుగు తరాల కు చెందిన అందరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.