Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 5:26 pm Posted by : ramakrishna

ఘనంగా చౌడేశ్వరి మాత కళ్యాణ మహోత్సవ వేడుకలు

 

రుద్రూర్ బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని దేవాంగుల ఆరాధ్య దైవమైన రామలింగ చౌడేశ్వరి ఆలయంలో ఆదివారం చౌడేశ్వరి మాత కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భాజాభజంత్రిలతో మహిళలు మంగళ హరతులతో ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ పహాడే, దేవాంగ కులస్తులు ఈర్వ శ్రీనివాస్, లోగం రాజేష్, ఓంకార్ స్వామి, లోగం సురేష్, తొప్పరి శివ, కాట్రపు రాజు, తొర్తి చందర్, బల్మి ప్రణయ్, క్రాంతి కుమార్, ఈర్వ నాగరాజు, కాట్రపు సాగర్, ఈర్వ అవినాష్, ఈర్వ క్రాంతి, బల్మి ఉమాకాంత్, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.