Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 July 2025, 6:39 pm Posted by : ramakrishna

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం ఎమ్మార్పీఎస్ అవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేసారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గోనె యాదయ్య మాట్లాడుతూ.. 30 వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని 31వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం సంతోషకరమని మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం చేకూర్చార ని వారు అన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మార్పీఎస్ మరిన్ని కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గోనె సురేష్, మేత్రి హనుమాన్లు, గోనె గంగారం యువకులు తదితరులు పాల్గొన్నారు.