ఘనంగా మహానేత వైఎస్సార్ వర్ధంతి
నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజాహృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయిన నేత అని పేర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ...