Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 6:15 pm Posted by : ramakrishna

ఘనంగా మహానేత వైఎస్సార్ వర్ధంతి

  • నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

Grand celebration of the death anniversary of the great leader YSR

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజాహృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయిన నేత అని పేర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ వంటి పథకాలు ఇప్పటికీ ప్రజల హృదయాలలో సజీవంగా ఉన్నాయని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీ, బాసర ఐఐఐటి, సాగునీటి పథకాలు, గుత్ప–అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 90 వేల ఎకరాలకు నీరు అందించడం వైఎస్సార్ కృషి ఫలితమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన నిలిచి, పంట రుణమాఫీ, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని భూపతి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ ధర్మగౌడ్, కాంగ్రెస్ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, యూత్ నాయకుడు ఉమ్మాజీ నరేష్, ఏఎంసీ డైరెక్టర్లు నరేందర్, రాజలింగం, గంగారెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రన్న, వాసు బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Grand celebration of the death anniversary of the great leader YSR