ఘనంగా రైతు భరోసా వేడుక సంబరాలు 

బతుకమ్మ బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలోని రైతు వేదికలో రైతు భరోసా కార్యక్రమం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ చైర్మన్ చీల శంకర్ నేతృత్వంలో, కాంగ్రెస్ నేతలు, రైతుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 16న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన రైతు భరోసా కార్యక్రమాన్ని హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. అనంతరం బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా మార్కెట్...