సిద్ధరామేశ్వర నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు

  భిక్కనూరు, బతుకమ్మ :   భిక్కనూరు మండలంలోని సిద్ధరామేశ్వర నగర్‌లో ఆషాడ మాసం సందర్భంగా మైసమ్మ బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను తలపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. డోలు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలతో వాతావరణం భక్తిమయంగా మారింది. భక్తుల సహాయార్థం గ్రామపంచాయతీ, ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ కమిటీ సభ్యులు అనసూయ రెడ్డి, సర్పంచ్ జనగామ...