రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు
. . . భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించిన విద్యార్థులు బాన్సువాడ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ పాఠశాలలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, పూలతో అందంగా అలంకరించి పండుగ వాతావరణాన్ని సృష్టించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్నారు. బాలికలు తలపై బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించగా, డప్పు చప్పుళ్లు, జానపద నృత్యాలు, సాంస్కృతిక...