Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 October 2024, 6:18 pm Posted by : ramakrishna

స్నేహ సొసైటీ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ ప్రాజెక్టు లో పనిచేస్తున్న ఆయా విభాగాల సిబ్బంది తో కలిసి బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. మహిళా మణులు ఎంతో సంతోషంగా సహజసిద్ధమైన రకరకాల రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకున్నారు.. బతుకమ్మ పాటలను ఆలపిస్తూ బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ దివ్యంగా పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది మాట్లాడుతూ జిల్లా పాలనయాత్రాంగానికి ప్రజలకు, మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ లో జరుపుకునే పండుగలు బోనాల పండుగ బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. స్నేహ సొసైటీలో స్నేహితులందరితో సంతోషంగా బతుకమ్మను అందరం కలిసి రంగు రంగుల పూలతో పేర్చి బతుకమ్మ ఆడడం సంతోషంగా ఉందని అన్నారు… స్నేహ సొసైటీలో దివ్యాంగుల పాఠశాల సిబ్బంది, అందుల పాఠశాలలోని సిబ్బంది, టార్గెటేడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న మహిళ సిబ్బందితో ఈ పండుగను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో మహిళలు జరుపుకునే అత్యంత గొప్ప పండుగని చెప్పారు.. ఈ పండుగలు గత పదేళ్లకు పైగా ప్రతి సంవత్సరం బోనాల పండుగ , బతుకమ్మ జరపడం ఎంతో సంతోషంగా ఉందని స్నేహ సొసైటీలో మహిళ సిబ్బంది పేర్కొన్నారు. ఈ బతుకమ్మ ఉత్సవాల్లో స్నేహ సొసైటీ కార్యదర్శి S. సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, సుజాత, స్నేహ టార్గెటేడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు మొయిజ్ అహ్మద్, స్నేహ సొసైటీ ప్రాజెక్ట్ లోని ఆయా విభాగాల్లోని సిబ్బంది పాల్గొన్నారు.

Grand Bathukamma celebrations in Sneha Society