ఘనంగా అంకురార్పణ, విశ్వక్సెన పూజా
భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్ట లక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మొదలు నుండి చివరి వరకు ఎలాంటి విగ్నలు కలుగకుండా, నిర్వీగ్నంగా ఉత్సవాల పరిసమాప్తి కోసం ఆలయ అర్చకులు ఘనంగా అంకురార్పణ కార్యక్రమంను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం శ్రీవారి గర్భలయంలో స్వామి వారికి ముందుగా విశ్వక్సెనా పూజను నిర్వహించి శ్రీవారి ఉత్సవమూర్తుల ను పల్లకిలో తీసుకువచ్చి కొండ కింద గల కల్యాణ మండపంలో ఉంచిన అర్చకులు పుణ్యాహవచనం, రక్షాబంధనంను నిర్వహించి, శ్రీమత్ భగవత్గీతను పారాయణం చేశారు. అనంతరం పుట్టమన్నును తెచ్చి...