Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 January 2025, 5:34 pm Posted by : ramakrishna

11 దాటిన గ్రామపంచాయతీకి తాళం

  •  విధులకు హాజరుకాని పంచాయతీ కార్యదర్శి 
  •  సెలవు పెట్టకుండానే డుమ్మా
  •  ఎంపీడీవో కు ఆరా తీయగా ఎలాంటి సమాచారం లేదని సమాధానం

నిజాంసాగర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు తాండ  గ్రామ పంచాయతీ కార్యదర్శి  11 గంటల  సమయం కావస్తున్నా గ్రామపంచాయతీ కార్యాలయం తాళం వేసి ఉండడంతో  తండావాసులను  అడుగగా  కార్యదర్శి  ఇంకా విధులకు రాలేదని తెలపడంతో. ఈ విషయంపై ఎంపీడీవో నాగేశ్వరరావును వివరణ కోరగా  తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని  తెలిపారు. గ్రామాల్లో సర్పంచు లేక అవస్థలు పడుతున్న  ప్రజలకు పాలన గాడి తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై  ప్రభుత్వం గ్రామ కార్యదర్శులకు పెత్తనం అప్పజెప్పడంతో వారి ఇష్టానుసారంగా ప్రజలకు అందుబాటులో లేక సమయపాలన పాటించక పోగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు పర్యవేక్షించి విధులకు డుమ్మా కొడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తాండవాసులు కోరుతున్నారు.