నిర్దిష్టమైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తీసుకురావాలి

కామారెడ్డి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ కామారెడ్డి, బతుకమ్మ : నిర్దిష్టమైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. మంగళవారం  రాజంపేట, లింగంపల్లి, కామారెడ్డి మండలాల్లోని రాజంపేట, కొండాపూర్, గుండారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, న్నాన్యమైన ధాన్యం కొనుగోళ్లు చేయడం జరుగుతుందని, దాన్యంలోని చెత్తను తొలగించాలని, నిర్దిష్ట తేమ శాతం ఉండాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల్లో ఆయా రైస్ మిల్లులకు తరలించాలని సెంటర్...