లింగంపేట్, బతుకమ్మ :
స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా డిఆర్డిఓ సురేందర్ అధికారులకు సూచించారు. మండలంలోని కోమటిపల్లి కన్నాపూర్ ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం వివరాలు తూకం వేసిన ధాన్యం వరకు రైస్ మిల్ కు పంపిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం వేసిన రైతుల వివరాలు వెంట వెంటనే ట్యాబ్ లో నమోదు చేయాలని ఆయన సూచించారు ధాన్యం రవాణా కోసం లారీలు అందుబాటులో ఉంచాలని సంబంధిత ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ కు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు రైతులకు ఇబ్బంది కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు . ఆయన వెంట సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ డిఎస్ఓ వెంకటేశ్వరరావు ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ ఎన్ఫోర్స్మెంట్ డిటి సురేష్ ఏపీఎం వినోద్ తోపాటు సీసీలు మహిళా సమాఖ్య సభ్యులు కొనుగోలు కేంద్రాల ఇన్ చార్జీలు రైతులు ఉన్నారు.
