అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
బిజేపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ రుద్రూర్, బతుకమ్మ: తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ లేదని, వెంటనే మార్కెట్ కమిటీ...