Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 4:39 pm Posted by : ramakrishna

అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

  • ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతన్నలు

 

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ :  రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలన్న ఉద్దేశంతో రోడ్లకు ఇరువైపులా, పంట పొలాల వద్ద  రైతులు వరి ధాన్యాన్ని ఆరపెట్టారు. కానీ ఈ అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గురువారం మధ్యాహ్నం వర్ని మండల కేంద్రంలో ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షం కురిసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వర్ని, శ్రీనగర్, జాకొర, జలాల్ పూర్, తగిలెపల్లి, కూనిపూర్  తదితర గ్రామాల్లో అకాల వర్షం కురవడంతో రైతులు ఆరబెట్టుకున్న దాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకుందామంటే తేమశాతం ఎక్కువగా ఉందని అధికారులు కొనడం లేదని, అందుకే వరి ధాన్యాన్ని ఆరబెడుతున్నామని రైతులు వాపోయారు. అకాల వర్షం రైతులకు శాపంగా మారిందని రైతన్నలు వాపోతున్నారు.