Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2025, 6:55 pm Posted by : ramakrishna

ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి

  • అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్

 

కామారెడ్డి, బతుకమ్మ : అకాల వర్షాల వలన వరి ధాన్యం తడిసి పోకుండా తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. గురువారం  సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి, బీబీపేట్ మండలం మల్కాపూర్, దోమకొండ వరి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలకు ధాన్యం తడిసి పోకుండా టార్ఫాలిన్ లను వినియోగించాలని, రైతులకు టార్పాలిన్ లను అందించాలని తెలిపారు. ఆకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి పోవడం జరుగుతుందని, తూకం వేసిన వరి పంటను లారీలలో మిల్లులకు వెంటది వెంట తరలించాలని తెలిపారు.

Grain should be transported to mills immediately.