Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2024, 11:29 am Posted by : ramakrishna

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి

బాన్సువాడ, బతుకమ్మ : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతులకు సూచించారు. రాష్ర్ట ఆగ్రో ఇండస్ర్టీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి బాన్సువాడ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పోచారం సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ,సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి , మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఖాలేక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అసద్ , అంజిరెడ్డి, గోపాల్ రెడ్డి , మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నార్ల సురేశ్, నార్ల రవీందర్, ఎజాస్, గుడాల నగేశ్, ఎజాస్, షాహబ్, మోహన్ నాయక్, శ్రీధర్, వెంకన్న, ఎండీ దావుద్, కొట్టం గంగాధర్, కౌన్సిలర్లు , డైరెక్టర్ సాయిలు, లింగం, గౌస్, నర్సుగొండ తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Grain should be sold at purchase centers