Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 12:55 pm Posted by : ramakrishna

తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

. కోటగిరి తహసీల్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
కోటగిరి, బతుకమ్మ: తరుగు లేకుండా ధ్యానం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోటగిరి తహసీల్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత ఖరీఫ్ సీజన్ లో క్వింటాల్ కు కిలో తరుగు తీయగా రబీ సీజన్ లో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 40కిలోల బస్తాకు 41 కిలోల 500 గ్రాముల నుంచి 650 గ్రాముల వరకు అధిక కాటా పెట్టడం ద్వారా క్వింటాల్ కు రెండున్నర కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తహసీల్దార్ సమక్షంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏముల నవీన్, మామిడి శ్రీనివాస్, కర్నె గజేందర్, పాకాల సాయిలు, ఏడ్డేడి పోశెట్టి మామిడి సాయిప్రసాద్, కాశీరామ్, తెల్ల శ్యామ్ సుందర్, ఏలుట్ల గజేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Grain should be purchased without any depreciation.