ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : వరి ధాన్యం పంటను త్వరితగతిన తూకం వేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పాక్స్ ద్వారా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరి ధాన్యం సేకరణ త్వరగా చేపట్టాలని అన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టాలని తెలిపారు. అకాల వర్షాల...