ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు  వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును శుక్రవారం కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 4 లక్షల 29 వేల ఎకరాలలో వరిసాగు చేశారని,  ఇప్పటివరకు లక్ష ఎకరాలలో రైతులు వరి పంట కోసారని  తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేయలేదని అన్నారు. కేవలం మొక్కుబడిగా ఇప్పటివరకు జిల్లాలో 150 కొనుగోలు కేంద్రాలకు కొబ్బరికాయలు కొట్టారు, కానీ కొనుగోలు ఇంకా ప్రారంభించలేదని...