ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో బుధవారం వరి కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ వెంకట్రావు,మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్,ఐకెపి సిబ్బంది హాజరయ్యారు, అనంతరం వారు మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలన్నారు. ఎల్లారెడ్డిపల్లి,వెంగల్పాడు,కేకే తండా, రంజిత్ నాయక్ తండ ప్రజలు పాల్గొన్నారు.