ఎస్ హెచ్ జీలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మహిళా స్వయం సహాయక సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో కనీసం 270కిపైగా కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల...