ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రెంజల్ మండల కేంద్రంలో ఐకెపి మహిళా సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యం నిల్వలను, వాటి నాణ్యతను పరిశీలించారు. మాయిశ్చర్ మీటర్ ద్వారా ధాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా...