ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందికి గురి కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సహకార సంఘాల ఇంచార్జిలతో కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరిపామని అన్నారు. అయితే...