కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం
లారీల కొరతతో ఎక్కడిక్కడే నిలిచిన ధాన్యం కృతిమ కొరత సృష్టిస్తున్న లారీ కాంట్రాక్టర్లు నల్లమట్టి, ఇసుక తరలింపులో లారీల బిజీ నిజామాబాద్, బతుకమ్మ : మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. 63వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. వడ్లు కొనుగోళ్లకు సరిపడా తేమ శాతం ఉన్నప్పటికీ 30 రోజులుగా కొనుగోలు చేయటం లేదని అధికారులను రైతులు నిలదీశారు. హమాలీలు కొరత, లారీల కొరత కారణంగా కొనుగోళ్లు చేయటం లేదని రైతుల...