Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 1:33 pm Posted by : ramakrishna

మహారాష్ట్ర నుంచి వస్తున్న ధాన్యం లారీ పట్టివేత

బోధన్,బతుకమ్మ : మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తీసుకొస్తున్న ధాన్యం లారీని సాలూర మండల సరిహద్దులో పోలీసులు పట్టుకున్నారు. మంజీర సరిహద్దులో పంట సాగు చేస్తున్న రైతులు కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే అధిక ధర వస్తుందని తెలంగాణకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వర్ని గ్రామానికి చెందిన ఓ రైతు ధాన్యం తీసుకువస్తుండగా రూరల్ పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలించారు. సివిల్ సప్లయి అధికారులకు సమాచారం అందించారు.