ఇంకా రోడ్లపైనే ధాన్యం

ఇందల్ వాయి, బతుకమ్మ: అందాల పోటీలు నిర్వహిస్తున్నామని గొప్పగా చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ప్రశ్నించారు. ఇందల్ వాయి తడిసిన ధాన్యాన్ని ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో పదేళ్లు ఇబ్బందులు పడ్డ రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరీ ఘోరంగా తయారైందన్నారు. ఓ వైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు రోడ్లపైనే ధాన్యం రాశులు ఉన్నాయని, బోనస్ పేరు చెప్పి రైతులను ఆగం చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో 12...