Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2025, 1:16 pm Posted by : ramakrishna

ఇంకా రోడ్లపైనే ధాన్యం

ఇందల్ వాయి, బతుకమ్మ: అందాల పోటీలు నిర్వహిస్తున్నామని గొప్పగా చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ప్రశ్నించారు. ఇందల్ వాయి తడిసిన ధాన్యాన్ని ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో పదేళ్లు ఇబ్బందులు పడ్డ రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరీ ఘోరంగా తయారైందన్నారు.

ఓ వైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు రోడ్లపైనే ధాన్యం రాశులు ఉన్నాయని, బోనస్ పేరు చెప్పి రైతులను ఆగం చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని అధికారులు చెబుతున్నారని, కానీ శనివారం సాయంత్రం వరకు 8లక్షల 60 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగా.. మిగతా ధాన్యం రోడ్లపై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం లోడ్ తో వెళ్తున్న ఒక్కో లారీ రైస్ మిల్లుల వద్దే 15 నుంచి 20 రోజులు ఉంటోందని, క్వింటాల్ కు 8 కిలోల కడ్తా తీస్తున్నారని అన్నారు.

అధికార యంత్రాంగం ఏం చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. రైతులను ఎవరు ఆదుకుంటారు.. ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, సుదర్శన్ రెడ్డి, సీఎం రేవంత్ ఆదుకుంటారా? అని ప్రశ్నించారు. రూరల్ ఎమ్మెల్యే గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు.

Grain is still on the roads.