అక్టోబర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి, బతుకమ్మ: సన్న ధాన్యం విక్రయించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్ కు 500 రూపాయల చొప్పున బోనస్ స్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై శుక్రవారం కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐకేపీ  ఆధ్వర్యంలో 23, సహకార సంఘాల ఆధ్వర్యంలో 328 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. ముందస్తుగా అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని పేర్కొన్నారు....