Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2024, 2:01 pm Posted by : ramakrishna

అక్టోబర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి, బతుకమ్మ: సన్న ధాన్యం విక్రయించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్ కు 500 రూపాయల చొప్పున బోనస్ స్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై శుక్రవారం కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐకేపీ  ఆధ్వర్యంలో 23, సహకార సంఘాల ఆధ్వర్యంలో 328 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. ముందస్తుగా అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని పేర్కొన్నారు. జిల్లాలో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్ కు రూ.2,203, సాధారణ కామన్ గ్రేడ్ ధాన్యం క్వింటాల్ కు రూ.2183 చెల్లించనున్నట్లు తెలిపారు. గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు సిద్ధం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీటి వసతి, టెంట్లు, విద్యుత్  సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీ ఆర్డీవో సురేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, సివిల్ సప్లయీస్ మేనేజర్ రాజేందర్, సహాయ సివిల్ సప్లయీస్ అధికారి నరసింహారావు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ట్రాన్స్ పోర్ట్  అధికారి శ్రీనివాస్ రెడ్డి, డీసీవో రామ్మోహన్, ఎల్డీఎం రవికాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి రమ్య, అధికారులు పాల్గొన్నారు.