Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 3:05 pm Posted by : ramakrishna

‘ఫ్యూచర్ లైన్’లో గ్రాడ్యుయేషన్ డే

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని ఆర్యనగర్ లో ఉన్న ఫ్యూచర్ లైన్ ప్రీ ప్రైమరీ స్కూల్ లో బుధవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ప్రైమరీ ఎడ్యుకేషన్ లోకి అడుగుపెడుతున్న చిన్నారులకు స్కూల్ డ్రైరెక్టర్ ప్రియాంక సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

విద్యా జీవితంలో ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ లోకి ప్రవేశించడమంటే మొదటి మెట్టు నుంచి రెండో మెట్టుకు చేరుకోవడం వంటిదని, విద్యార్థులు క్రమశిక్షణతో ఏకాగ్రతతో చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో  టీచర్లు లావణ్య, సంధ్య, మాధవి, సునీత తదితరులు పాల్గొన్నారు.

Graduation Day at ‘Future Line’