Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 8:29 pm Posted by : ramakrishna

అంగన్ వాడీ లో గ్రాడ్యుయేషన్ డే

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

ప్రీ స్కూల్ విద్య వలన పిల్లలు పాఠశాలకు రావడం అలవాటు అవుతుందని ప్రీ స్కూల్ విద్య వలన విద్యార్థుల్లో పాఠశాలకు వెళ్లాలని ఆలోచన కలుగుతుందని, భయం తొలగిపోతుందని అంగన్ వాడీ టీచర్ ఇందిరా సుమలత అన్నారు. పిల్లల్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు అంగన్ వాడీ కేంద్రానికి పంపాలని తెలియజేశారు. అనంతరం ప్రీ స్కూల్ విద్యా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న పిల్లలకు నూతన వస్త్రాలు వేసి గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. నూతన దుస్తుల్లో పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

 

Graduation Day at Anganwadi