- వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో జులై 16 న జరిగే రెండవ స్నాకోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని స్నాతకోత్సవ కమిటీ కన్వీనర్స్ మీటింగ్ లో వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు తెలిపారు. విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత మొట్ట మొదటి స్నా తకోత్సవం 13-11-2013 జరిగిందని అనంతరం 12 సంవత్సరాల తర్వాత రెండో స్నాతకోత్సవాన్ని 16న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని వర్షాకాలం కావున ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. స్నాతకోత్సవానికి హాజరై విద్యార్థులకు, పరిశోధకులకు అతిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ స్నాతకోత్సవంలో 2014 నుండి 2023 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వివిధ విభాగాల నుండి మొదటి ర్యాంకు పొందిన 130 మంది స్టూడెంట్స్ కు గోల్డ్ మెడల్స్ తో పాటు జూన్ 30, 2025 వరకు వివిధ విభాగాలలో పరిశోధనలు పూర్తి చేసుకున్న సుమారు 156 మంది పరిశోధకులకు పీహెచ్డీ పట్టాలు గవర్నర్ గారి చేతుల మీది నుండి ఇవ్వనున్నారని వైస్ ఛాన్స్లర్ తెలిపారు. ఈ కమిటీ మీటింగులో రిజిస్ట్రార్ ఆచార్య ఏం యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ తో పాటు రిసెప్షన్ కమిటీ, డయాస్ కమిటీ, సీటింగ్ ఏర్పాటు కమిటీ, సెనేట్ కమిటీ, ప్రింటింగ్ కమిటీ, హాస్పిటాలిటి కమిటీ, ఎంట్రీ అండ్ రెగ్యులేషన్ కమిటీ, ప్రెస్ సెండ్ మీడియా కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ, డిస్ట్రిబ్యూషన్ కమిటీ, డిసిప్లిన్ కమిటీ, గోల్డ్ మెడల్స్ నిర్వహణ కమిటీ, క్యాంపస్ రిజర్వేషన్ కమిటీ కన్వీనర్లు ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ అపర్ణ, ప్రొఫెసర్ హారతి, ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ ఆంజనేయులు, ప్రొఫెసర్ కె రవీందర్ రెడ్డి,ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ నాగరాజు పాత, పి ఆర్వో డైరెక్టర్ డా. ఏ పున్నయ్య లు పాల్గొన్నారు.