Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2024, 3:20 pm Posted by : ramakrishna

పట్టబద్రులు  ఓటు హక్కును వినియోగించుకోవాలి

బతుకమ్మ, దుబ్బాక ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న ఎంతోమంది పట్టభద్రులు తమ హక్కుల సాధన కోసమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి  ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ ఫోరం అధ్యక్షుడు, టి ఆర్ పి ఎస్ ఐ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు, ఆయన బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టభద్రులు 2021, నవంబర్ 6 తేదీ,2024 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు ఆన్లైన్ అప్లై చేసుకోవాలని తెలిపారు.  9652605686,9705577544 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. దీనికోసం డిగ్రీ మెమో, ఆధార్ కార్డు జిరాక్సులు, ఒక కలర్ ఫొటో తమ నంబర్లకు ఫోన్ చేసి సంప్రదిస్తే, ఉచితంగా పట్టభద్రుల ఓటు ఆన్లైన్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మెదక్ కరీంనగర్, నిజమాబాద్,అదిలాబాద్ జిల్లాలలోని పట్టబద్రులు 16,678 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ పొరం ప్రధాన కార్యదర్శి గిరిబాబు, ఆకారం చంద్ర శేఖర్ శర్మ, సాయికృష్ణ శర్మ, న్యాయవాది కాస్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.