Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 1:46 pm Posted by : ramakrishna

ప్రభుత్వ భూమి కబ్జా ను అడ్డుకోవాలి

కోటగిరి, బతుకమ్మ: కోటగిరి మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కబ్జాను అడ్డుకోవాలని కోరుతూ తహసీల్ కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1314 సర్వే నంబర్ లోని 15 గుంటల ప్రభుత్వ భూమితోపాటు దాని పక్కనే ఉన్న 161 బీటీ రోడ్డు బౌండ్రినీ సైతం కబ్జా చేసినందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పుల్లల మోహన్ రావు, కాపుగాండ్ల శ్రీను, ఏముల నవీన్, దయానంద్, మామిడి శ్రీనివాస్, డాన్ రాజు, పి సతీశ్, పత్తి సతీశ్, మామిడి శ్రీను, మహేశ్ రెడ్డి, శ్రీను, సాయిప్రసాద్, వడ్ల శ్యామ్, శ్రీను, యార్లగడ్డ రవి తదితరులు పాల్గొన్నారు.


Grabbing of government land should be stopped