నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కు నూతనంగా బదిలీపై వచ్చిన డిఆర్ఓ గీత ని జిపిఓ లు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. శనివారం డిఆర్ఓ కార్యాలయంలో డిఆర్ఓకు పుష్పగుచ్చాలు అందచేసారు. ఉద్యోగ పరంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని వారు కోరారు. జిపిఓలకు విధి నిర్వహణలో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తానని, విధి నిర్వహణ ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని డిఆర్ఓ, జిపిఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బియ్య సాయినాథ్, ప్రధాన కార్యదర్శి గున్నం సంతోష్, జిల్లా మహిళ అధ్యక్షురాలు గంగాభవాని, జిల్లా ఉపాధ్యక్షులు నీరడి రమేష్, అఫ్రొజ్, గిరి, రాజేశ్వర్, రాకేష్, రజిత, హరిచరన్, అరుణ, అనితా, జ్యోతి, సుమన్ జిపిఓలు పాల్గొన్నారు.