లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీపీఓ

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం అథ్మకూర్ గ్రామంలో గ్రామ పాలన అధికారి (జీపీఓ) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గురువారం ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అథ్మకూర్ గ్రామానికి చెందిన జీపీఓ మాతే రాజేష్ (37) పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అథ్మకూర్ గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి పట్టా పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించిన విచారణ నివేదికను ఉన్నత రెవెన్యూ అధికారులకు సమర్పించేందుకు జీపీఓ రాజేష్ రూ.5...