జీపీ కార్మికులను పర్మినెంట్ చేయాలి

బతుకమ్మ,  జుక్కల్:  జుక్కల్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో శనివారం గ్రామపంచాయతీ కార్మికులు  రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టోకెన్ సమ్మె నిర్వహించారు. జిపి కార్మికుల సమ్మె కు మద్దతుగా సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు. సురేషగొండ పాల్గొనిమాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం. గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని జిపి కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని, ప్రతినెల...