Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 3:31 pm Posted by : ramakrishna

జీపీ కార్మికులను పర్మినెంట్ చేయాలి

బతుకమ్మ,  జుక్కల్:  జుక్కల్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో శనివారం గ్రామపంచాయతీ కార్మికులు  రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టోకెన్ సమ్మె నిర్వహించారు.
జిపి కార్మికుల సమ్మె కు మద్దతుగా సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు. సురేషగొండ పాల్గొనిమాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం. గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని జిపి కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని, ప్రతినెల ఒకటవ తేదీన వేతనాలు నేరుగా కార్మికుల అకౌంట్లో పడాలని అన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ. సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని  డిమాండ్ చేశారు. కార్మికులందరూ తమ డిమాండ్ల పరిష్కారం అయ్యేంతవరకు ఐక్యంతో ఉండి డిమాండ్లు సాధించుకోవాలని జిపి కార్మికులందరికీ ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎస్.అజయ్ కుమార్,జిపి కార్మికుల మండల అధ్యక్షులు గోవింద్, మండల కార్యదర్శి వాగమరే సాయిలు, ఉపాధ్యక్షులు ఈరన్న, కార్మికులు ఈ.పండరి, నర్సింగ్, కే. దవులయ్య, యాదవు, సంజయ్, ఈ. దేవదాస్, మెత్రిగంగారాం, మండలంలోనివివిధగ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

GP workers should be made permanent