జీపీ కార్మికుల వేతన సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ :  తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు టోకెన్ సమ్మెలో భాగంగా గురువారం ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.ముత్తెన్న, ఎం.సుధాకర్, యూనియన్ రాష్ట్ర నాయకులు ఆర్.రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,740 గ్రామపంచాయతీల్లో సుమారు 60వేల మంది కార్మికులు వివిధ కేటగిరీలల్లో విధులు...