Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2025, 11:33 am Posted by : ramakrishna

జీపీ కార్యదర్శి హత్య

పిట్లం మండలం చిన్న కొడప్ గల్ లో ఘటన

రెడ్డి చెరువులో మృతదేహం లభ్యం

పిట్లం, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లాలో జీపీ కార్యదర్శి  హత్యకు గురయ్యాడు. పిట్లం మండలం చిన్నకొడపగల్  జీపీ కార్యదర్శిగా కృష్ణ(35) గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కృష్ణ అదృశ్యమయ్యాడు. శనివారం ఉదయం చిన్నకొడప్గల్ రెడ్డి చెరువులో కృష్ణ మృతదేహం లభ్యమైంది.  కృష్ణ తలపై గాయాలు ఉండడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఘటన స్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ సంబంధిత అధికారులు పరిశీలించారు. పిట్లం మండలం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  కాగా, మృతుడి కృష్ణ ది పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని జగదాంబ తండా వాసి  అని తెలిసింది.

GP secretary murdered