. . . కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన టి.జి.ఓ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డికి టి.జి.ఓ. సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, కార్యదర్శి అమృతకుమార్, సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగుల కృషి, సహకారం వల్లే ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమైందని, టి.జి.ఓ. సంఘం జిల్లా ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దేవి సింగ్, జగన్, దండుస్వామి, చందు, రామస్వామి,తదితరులు పాల్గొన్నారు.