జీపీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా  పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం నిర్వహించారు.  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లలోని ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు...